వంతెన లేక గ్రామస్తుల అవస్థలు
మాగనూరు ఫిబ్రవరి 18: నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని గజరం దొడ్డి పెద్దవాగుపై వంతెన లేకపోవడంతో వా హనదారులు, ఆయా గ్రామస్తులు, తీవ్ర అవస్థలు పడుతున్నా మనీ తెలిపారు.
ఈ రహ దారి నుంచి ప్రతి రోజు మక్తల్ పట్టణానికి వ్యాపారాల నిమిత్తం వ్యవసాయ నికి కావలసిన పనిముట్లు, కిరాణా సామాన్లు, ఇతర సామగ్రి తీసుకురావడానికి ప్రతిరోజు మండలంలోని కొల్పూరు, గజరం దొడ్డి ,మంది పల్లి ,గ్రామా ల ప్రజలు రాకపోకలు కొనసాగిస్తుంటారు. వర్షాకాలంలో పెద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగులో నీరు తగ్గేంత వరకు ఈ యొక్క రహదారి గుండా వెళ్లలేకపోతున్నామని ఆయా గ్రామ ప్రజలు తెలిపారు.
గజరం దొడ్డి పెద్దవాగుపై వంతెనడమిస్తే వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమర్ చింత, ఆ ప్రాంతాల ప్రజలతో పాటు వ్యాపారాలు నిమిత్తం గజరం దొడ్డి ,పుం జనూరు ,మందిపల్లి ,కొల్పూరు , కృష్ణ మండలంలోని ముడుమాలు , మురాహ రి దొడ్డి ,గ్రా మాల ప్రజలకు పెద్దవాగు పై వంతెన నిర్మాణం చేయడం ద్వారా 167వ జాతీయ రహదారి టై రోడ్ వద్ద కలవడంతో ఇక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరుకు, అదేవిధంగా దక్షిణ మ ధ్య రైల్వే కృష్ణా రైల్వే స్టేషన్ కు వెళ్లవచ్చునని ప్రయాణికులు, రైతులు, తెలిపారు.
గజరం దొడ్డి నుంచి , మందిపల్లి , అడవి సత్కారం, వడ్వాటు, మీదుగా మక్తల్ కు వెళ్ళుటకు 10 కిలోమీటర్ల దూరం అదనముగా ప్రయాణించవలసి వస్తుందనీ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ,ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు ,వంతెన నిర్మాణ పనులు చేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు..




