23 August, 2026 | 1:10 AM

గాయత్రి ట్రీసా జోడీకి కాంస్యం

23-08-2026 12:00 AM
  1.    15 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం
  2. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్ 

న్యూఢిల్లీ, ఆగస్టు 22: బీడబ్ల్యూఎఫ్ ప్ర పంచ చాంపియన్ షిప్ మహిళల డబుల్స్ లో భారత్ నిరీక్షణకు తెరపడింది. భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శ నివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా- గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్‌షు, టాన్ నింగ్ చేతి లో 21-18, 13--21, 8--21 తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ను చైనా జోడీ దూకుడుగా ప్రారంభించినా.. భారత షట్లర్లు అద్భుతంగా పుంజుకున్నారు.

కీలక సమయాల్లో వరుస పాయింట్లు సాధిస్తూ ఆధిపత్యం ప్రదర్శించిన ట్రీసా-గాయత్రి తొలి గేమ్ను 21--18తో సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో ఇరు జట్ల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. వరుస పాయింట్లు సాధిస్తూ భారత జోడీపై ఒత్తిడి పెంచిన చైనా షట్లర్లు రెండో గేమ్‌ను 21--13తో గెలిచారు. దీంతో మ్యాచ్ నిర్ణాయత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. మూడో గేమ్‌లో మాత్రం ట్రీసా- గాయత్రి జోడీ పెద్దగా ప్రతిఘటించలేకపోయింది.

ఆరంభం నుంచే చైనా జోడీ ఆధిపత్యం కొనసాగించింది. భారత షట్లర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21--8తో మూడో గేమ్‌ను ముగించి మ్యా చ్‌ను కైవసం చేసుకుంది. అయితే మహిళల డబుల్స్ విభాగంలో భారత్ చివరిసారిగా 20-11లో పతకం సాధించింది. అప్పట్లో జ్వాలా గుత్తా- అశ్విని పొన్నప్ప కూడా కాంస్యం గెలిచారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత అదే విభాగంలో ట్రీసా-గాయత్రి కాంస్యం గెలిచి రికార్డు నెలకొల్పారు.