23 August, 2026 | 1:36 AM

300 మీటర్ల బిగ్‌బోర్ షూటింగ్‌లో.. మహమ్మద్ అష్రఫ్ గన్యానీకి రెండు పతకాలు

23-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త, కాంపిటేటివ్ రైఫిల్ షూటర్ మహమ్మద్ అష్రఫ్ గన్యానీ 300 మీటర్ల రైఫిల్ ప్రోన్ బిగ్‌బోర్ షూటింగ్‌లో రెండు పతకాలు సాధించారు. ఈ నెల 18 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం ఆక్టోపస్ షూటింగ్ రేంజ్ల్లో జరిగిన 300ఎంరైఫిల్ ప్రోన్ బిగ్‌బోర్ ఈవెంట్స్2026లో ఆయన ఈ ఘనత సాధించారు.

డెక్కన్ ఎలైట్ ఓపెన్ బిగ్బోర్ గ్రాండ్ ప్రీ2026లో 300ఎంరైఫిల్ ప్రోన్ మెన్స్ ఇండివిడ్యువల్ విభాగంలో 273/ 300 స్కోర్‌తో సిల్వర్ మెడల్ సాధించిన గన్యానీ, II తెలంగాణ స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ కాంపిటీషన్స్2026లో అదే 300 ఎం రైఫిల్ ప్రోన్ విభాగంలో 273/300 స్కోర్‌తో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు.

తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యం లో జరిగిన ఈ నాలుగు రోజుల ఛాంపియన్‌షిప్‌లో రెండవ తెలంగాణ బిగ్ బోర్ షూ టింగ్ పోటీ2026, డెక్కన్ ఎలైట్ ఓపెన్ బిగ్ బోర్ గ్రాండ్ ప్రిక్స్2026, 2వ తెలంగాణ సూపర్ బిగ్ బోర్ ఓపెన్ షూటింగ్ పోటీ 2026వంటి మూడు ప్రధాన పోటీలు నిర్వహించారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లా లు, సంస్థలకు చెందిన షూటర్లు పోటీల్లో పాల్గొన్నారు.తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు, నేషనల్ రైఫిల్ అసోసియే షన్ ఆఫ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెం ట్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సంఘీ మాట్లాడుతూ, షూటర్లు ప్రదర్శించిన క్రమశిక్షణ, అంకితభావం, క్రీడాస్ఫూర్తిని అభినందించారు.