23 August, 2026 | 1:36 AM

నిందితుడిని 5 కోట్లు అడిగారు!

23-08-2026 12:52 AM
  1. కేసు నుంచి తప్పించేందుకు డిమాండ్ 
  2. పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సతీమణి గురుప్రీత్ ధన దాహం
  3. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
  4. లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ స్పందన.. ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు
  5. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి నోటీసులు

చండీగడ్, ఆగస్టు ౨౨: లైంగికదాడి కేసు లో ప్రధాన నిందితుడిని, ఆ కేసు నుంచి త ప్పించేందుకు పంజాబ్ సీఎం భగవంత్‌మా న్ సతీమణి గుర్‌ప్రీత్ కౌర్ రూ.5 కోట్లు డి మాండ్ చేశారని పంజాబ్ -హర్యానా హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజిత్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగికదాడికి గురైన బాధితురాలికి న్యాయం జరగకు ండా అడ్డుకోవడం మానవ హక్కుల ఉల్లంఘననేనని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

కేసు ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నందున, ఎన్‌హెచ్‌ఆర్సీ తక్షణం స్పందించి స్వతంత్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను భద్రపరచాలని కోరారు. విశ్రాంత న్యాయమూర్తి వ్యాఖ్యల ను ఆధారం చేసుకుని లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ (ఎల్‌ఆర్వో) చొరవ తీసుకుని ఎన్‌హె చ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసింది. 

ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందించింది. సీఎం సతీమణిపై వచ్చిన ఆరోపణలపై రెండు వారాల్లోపు వివరణ ఇవ్వాలని పం జాబ్ ప్రభుత్వ చీఫ్ సెక్రట రీతోపాటు డీజీపీకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఫి ర్యాదుపై జస్టిస్ ప్రియాంక్ కానూంగో నేతృత్వంలోని ఎన్‌హెచ్‌ఆర్సీ బెం చ్ ఈ కేసును విచారణకు స్వీకరించింది. అలాగే, ఫిర్యాదును కేంద్ర హోంశాఖ పరిధిలోని మహిళా భద్రతా విభాగానికీ ఎండార్స్ చేసింది.

ప్రతిపక్షాల ఆగ్రహం

తన సతీమణిపై వచ్చిన ఆరోపణలపై సీ ఎం భగవంత్‌మాన్ సమాధానం ఇవ్వాలని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అమరీందర్‌సింగ్ రాజా డిమాండ్ చేశారు. ప్రతిపక్ష శిరోమణి అకాళీదళ్ నేతలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, బిక్రమ్ సింగ్ కూడా ఇదే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. బాధితురాలికి న్యాయం జరగాలంటే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

నాపై అసత్య ప్రచారం: గుర్‌ప్రీత్ కౌర్

తనపై వచ్చిన ఆరోపణలను సీఎం సతీమణి గుర్‌ప్రీత్ కౌర్ ఖండించారు. త నపై కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు.. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్‌కు లీగల్ నోటీసు పంపించారు. 24 గంటల్లోపు తన నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే, న్యాయస్థానాన్ని ఆశ్రయించి క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.