ఇన్‌స్పెక్టర్ ప్రసన్నకు కాంస్యం
26-05-2024 12:05 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (విజయక్రాంతి): ప్లెజెస్ లిబరేషన్ గ్రాండ్ ప్రిలో కాంస్య పతకం సాధించిన ఇన్‌స్పెక్టర్ అల్లూరి ప్రసన్నకుమార్‌ను రాచకొండ కమిషనర్ తరుణ్‌జోషి అభినందించారు. చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో అల్లూరి ప్రసన్న కుమార్ బృందం తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. పాయింట్ 32 ఫైర్ పిస్టల్ పురుషుల విభాగంలో సత్తాచాటిన ప్రసన్నకుమార్ బృందాన్ని శనివారం నేరేడ్‌మెట్‌లోని కార్యాలయంలో రాచకొండ కమిషనర్ తరున్‌జోషి అభినందించి.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అభినందించిన రాచకొండ కమిషనర్






