4 July, 2026 | 2:39 AM

రింకూకు రజతం

26-05-2024 12:33 AM

కొబె (జపాన్): ప్రపంచ పార అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. శనివారం పోటీల్లో మరో రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల ఎఫ్ 46 జావెలిన్ త్రోలో రింకూ రజత పతకం దక్కించుకోగా.. అజీత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నాడు. రింకూ బరిసెను 62.77 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలువగా.. అజీత్ 62. 11 మీటర్లతో మూడో ప్లేస్ దక్కించుకున్నాడు. దీంతో ఈ టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఇందులో 5 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. ఓవరాల్‌గా పతకాల పట్టికలో మన దేశం ఆరో స్థానంలో ఉంది.

వరల్డ్ పారా అథ్లెటిక్స్ టోర్నీ