4 July, 2026 | 4:34 AM

జ్యోతి పసిడి గురి

26-05-2024 12:05 AM

న్యూఢిల్లీ: ఆర్చరీ ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదర గొట్టింది. దక్షిణ కొరియా వేదికగా జరిగిన జ్యోతి బృందం అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం కైవసం చేసుకుంది. శనివారం జరిగిన కాంపౌండ్ మహిళల ఫైనల్లో జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి స్వామితో కూడిన భారత జట్టు 232 తేడాతో హజల్, ఆయేషా బెరా, బెగం యుహ (టర్కీ) త్రయంపై గెలిచి స్వర్నం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్ భారత బృందానికి ఇది వరుసగా మూడో ప్రపంచకప్ పసిడి కావడం మరో విశేషం. నిరుడు ఆగస్టులో పారిస్‌పై గెలిచి స్వర్ణం నెగ్గిన మన బృందం..

గత నెలలో ఇటలీని చిత్తు చేసి గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ జోడీ రజతంతో సరిపెట్టుకుంది. తుదిపోరులో మన జంట 153 అమెరికా చేతిలో ఓడింది. ‘నిలకడైన ప్రదర్శన కొనసాగించడం ఆనందంగా ఉంది. పర్ణీత్, అదితి కూడా చక్కగా రాణించడంతోనే ఈ విజయం సాధ్యమైంది. మిక్స్‌డ్ విభాగంలోనూ స్వర్ణం సాధించాలని అనుకున్నా. అందుకోసం తీవ్రంగా కృషి చేశా. కానీ సాధ్యపడలేదు. వరుసగా మూడు ప్రపంచకప్ లలో మహిళల టీమ్ ఈవెంట్‌లో విజేతగా నిలవడం ఆనందంగా ఉంది’ అని ఫైనల్ అనంతరం జ్యోతి సురేఖ వెల్లడించింది.