రాష్ట్రంలో అల్లర్లకు బీఆర్‌ఎస్, బీజేపీలు కుట్రలు
- శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
- మంత్రి శ్రీధర్‌బాబు
ముత్తారం, మే9 (విజయక్రాంతి): రాష్ట్రం లో అల్లర్లు సృష్టించేందుకు బీఆర్‌ఎస్, బీజే పీ పార్టీల నాయకుల కుట్ర జరుగుతోందని, తమ బలనిరూపణ కోసం అల్లర్లు సృష్టిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్లశ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ జిల్లాను చెడగొట్టారని విమర్శించారు.
ప్రభు త్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు పోతుందని, 6 గ్యారంటీలో ఇప్పటికే నాలుగు గ్యారంటీ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని, రాబో యే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంటూ ప్రజల ఆశీర్వాదం పొందుతామన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ లు గుండాయిజం, రౌడీయిజంతో పోటాపోటీగా ఇష్టారాజ్యంగా కొట్లాడుకుంటూ ప్ర శాంతతను దెబ్బతీశారని ఆరోపించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఈ రెండు పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీ మిత్రపక్షంగా ఉం టూ చెట్టాపట్టాలేసుకొని ప్రత్యేకంగా ఉంటూ ఈ రోజు అధికారం లేకపోవడంతో పరోక్షం గా నటిస్తూ అల్లర్లు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు దొందూ దొందేనని ఆ రెండు పార్టీ లు ఒక్కటేనని విమర్శించారు. కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, సర్పంచ్ బొంతల అన్నపూర్ణ పాల్గొన్నారు.






