15 August, 2026 | 12:05 PM

ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం

15-08-2026 11:21 AM

- ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టం 

- లేఖ రాసి వెళ్లిన యువకుడు 

సిద్దిపేట క్రైం, ఆగస్టు 15 (విజయక్రాంతి) : ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సిద్దిపేట పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన గుండ్ల శంకర్, శైలజ కుమారుడు క్రాంతి కుమార్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కొంత కాలంగా ఆన్ లైన్ బెట్టింగ్, ట్రెడింగ్ లో డబ్బులు పొగొట్టుకున్నాడు.

శుక్రవారం ఉదయం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన క్రాంతి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందో ళన చెందారు. క్రాంతి తన స్నేహితుడు ఈశ్వర్ కు 'ఫోన్ పౌచ్ లో లెటర్ పెట్టాను' అంటూ మేసేజ్ చేశారు. ఈ విషయాన్ని ఈశ్వర్ క్రాంతి తల్లిదండ్రులకు  చెప్పాడు. బెట్టింగ్, ట్రేడింగ్ లో డబ్బులు పొగొట్టుకున్నానని, అనారోగ్యంతో బాధ పడుతున్నానని, తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడుతారని, అందుకే ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని లేఖలో రాసి ఉంది. తల్లి శైలజ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.