15 August, 2026 | 12:42 PM

తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి నా ధ్యేయం

15-08-2026 12:07 PM

ఎమ్మెల్యే మందుల సామేలు.

క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే

గ్రామాల్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

తుంగతుర్తి,(విజయక్రాంతి): నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యమని, 2000 కోట్ల పై చిలుకతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ గ్రామాన జాతీయ జెండాలు రెపరెపలాడగా, విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంది.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మందుల సామెల్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే, మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి రావాలని కోరారు.

అనంతరం మండల కేంద్రంలోని సివిల్ కోర్టు ఎండి గౌస్ పాష, తాహసిల్దార్ కార్యాలయం దయానందం, పోలీస్ స్టేషన్ సీఐ ఉపేందర్ రావు, మార్కెట్లో తీగల గిరిధర్ రెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో చలపతి, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు తల్లాడ కేదారి, తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు, సర్పంచులు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాఠశాలల్లో విద్యార్థుల