15 August, 2026 | 12:45 PM

జడ్పిహెచ్ఎస్ ప్రజ్ఞాపూర్ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకాలు

15-08-2026 11:32 AM

- అందజేసిన 1994-95 బ్యాచ్ విద్యార్థులు 

- 25 ఏళ్లుగా ఏటా రూ. 50 వేల విలువైన ప్రోత్సాహక బహుమతులు అందజేత 

గజ్వేల్, ఆగస్టు 15 : జడ్పిహెచ్ఎస్ ప్రజ్ఞాపూర్ పాఠశాల విద్యార్థులకు ఆ పాఠశాలలో చదివిన 1994-95 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పదవ తరగతిలో గత సంవత్సరం ఉత్తీర్ణత సాధించి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన బాలురు బాలికలకు వేరువేరుగా నగదు బహుమతులను అందజేశారు.

అలాగే పాఠశాలలో 6 నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు తరగతికి ఆరుగురు చొప్పున ఒక్కొక్కరికి  రూ.500ల ప్రోత్సాహక బహుమతి అందజేశారు. 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు తమ వంతుగా రూ. 50వేల విలువైన నగదు పురస్కారాలను అందిస్తూ విద్యార్థులను చదువులో పోటీపడేలా ప్రోత్సహిస్తున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పంజాల నరేష్, మైపాల్ రెడ్డి, పబ్బ రవి, ప్రభాకర్, ఉప్పలయ్య, రాజేందర్, రహీముద్దీన్, జహంగీర్, రవి, ఇబ్రహీం, పరశురాములు, ప్రమోద్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.