15 August, 2026 | 12:46 PM

బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 12:12 PM

బోధన్, ఆగస్టు 15(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి వందేమాతరం గేయాన్ని ఆలపించడం అభినందనీయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

దేశ ప్రజలంతా ప్రధానమంత్రికి మద్దతుగా నిలిచి, దేశం కోసం అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి ఆశయాలు, అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం బోధన్ పట్టణ ప్రజలకు, బీజేపీ కుటుంబ సభ్యులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్, కౌన్సిలర్ కోలిపాక రేణుక బాలరాజు, గుంత గంగాధర్, సీనియర్ నాయకులు ధర్మపురి, హనుమండ్లు చారి, ప్రధాన కార్యదర్శి మిర్జాపూర్ అరవింద్, పేరుక వెంకటేష్, కార్యదర్శి దేవకట్ట శివ, కోశాధికారి పప్పుల వేణు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గౌడ్, దుర్గాప్రసాద్, గడ్డం శ్రీనివాస్, రవి, హరి, కస్పలింగం, లోశ్రీ అనిల్, రాము, నాగయ్య, ఫణి, సాగర్, శివ, రవికిరణ్, ఉదయ్, బిట్టు, చింటూ తదితరులు పాల్గొన్నారు.