calender_icon.png 14 February, 2026 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు దీటుగా బీఆర్‌ఎస్ పోటీ !

14-02-2026 01:04:14 AM

  1. అధికార పార్టీ గెలిచిన సంఖ్యలో.. సగం వార్డులను గెలుచుకున్న గులాబీ పార్టీ 

గత పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే సీన్  

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : నువ్వా.. నేనా..? అన్నట్టుగా సాగిన పురపోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను చాటుకున్నది. ఎక్కువగా మున్సిపా లిటీలు గెలుచుకున్నప్పటికీ.. వార్డుల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్‌కు దీటుగానే ప్రధాన ప్రతిపక్ష  బీఆర్‌ఎస్ పోటీ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఉన్న వ్యత్యాసమే పట్టణాల్లోనూ కనిపించింది. మున్సిపల్‌కు సంబంధించి 2,582 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 1347 వార్డులను కైవసం చేసుకుంటే.. బీఆర్‌ఎస్ పార్టీ 719 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 263 స్థానాల్లో పాగా వేసింది.

బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా అప్పటి అధికార పార్టీ విజయం సాధించింది. అప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ వేళ్లమీద చెప్పుకునే స్థానాల్లోనే విజయం సాధించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. బీఆర్‌ఎస్ మాత్రం ఎక్కువ స్థానాల్లో గెలుపొం దింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోటీ జరిగినప్పటికీ  ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యత సాధించింది.

ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య పోటీ నెలకొన్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజాబాబాద్ కార్పొరే షన్లలో బీజేపీనే ఎక్కువ సీట్లు సాధించినా.. మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీఆర్‌ఎకు ఉమ్మడి మెదక్‌తో పాటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో బీఆర్‌ఎస్ పార్టీ ఎక్కువగా విజయం సాధించింది.