17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ ధర్నా

24-06-2025 12:09 AM

అశ్వారావుపేట, జూన్23,(విజయ క్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజక వర్గ కేంద్రమైన అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ధర్నా నిర్వహించారు.

అశ్వారావుపేట పట్టణ బిఆర్ ఎస్ ఆధ్వర్యం లో అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో వీధి లైట్లు, మంచినీటి సమస్యలు,పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థలు గత ప్రభుత్వంలో ఉన్నా పారిశుధ్యం ఇప్పుడూ ఉన్న పారిశుధ్యం పట్ల తేడా చూసి తక్షణమే ఉన్న సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ సిబ్బందికి వినతి పత్రం అందజేసారు.

ఈ కార్యక్రమం లో  మాజీ ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి మహిళ నాయకురాలు వగ్గెల.పూజ ,అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్,టౌన్ పార్టీ అధ్యక్షులు సంపూర్ణ,పేరాయి గూడెం పార్టీ అధ్యక్షులు బజరయ్య, మందపాటి రాజమోహన్ రెడ్డి, గుర్రాల చెరువు మాజీ సర్పంచ్ కలపాల దుర్గయ్య,నార్లపాటి చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు.