13 March, 2026 | 12:03 AM

మహిళల సాధికారతకు బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది

08-03-2026 05:49 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇల్లందు పట్టణంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో మహిళల సంక్షేమం, సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేశామని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా పెన్షన్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు మహిళలకు ఎంతో ఉపయోగపడినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.