ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
08-03-2026 05:45 PM
నిర్మల్,(విజయక్రాంతి) జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ ఆధ్వర్యంలో మహిళా ప్రజా ప్రతినిధులను సన్మానం చేశారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళ సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా జనరల్ సెక్రటరీ సీహెచ్ వినోద్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, వైస్ ప్రెసిడెంట్ బైండ్ల శ్రీనివాస్, టౌన్ సెక్రటరీ అబ్దుల్ వాహేద్, జిల్లా యాక్టివ్ మెంబర్ వసంత్ రావు, మహిళా నాయకురాలు గోల్కొండ రాజమణి మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




