10 July, 2026 | 10:29 PM

జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ధర్నా

10-07-2026 09:12 PM

కాలేశ్వరం నుండి వృధాగా పోతున్న జలాలను బస్వాపూర్, గంధ మల్ల రిజర్వాయర్లకు మళ్ళించాలి

మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వృదాగా పోతున్న గోదావరి జలాలను కన్నెపల్లి నుండి ఎత్తిపోసి గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులకు మళ్లించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జెడ్పీ చైర్మన్, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ... కాలేశ్వరం రిజర్వాయర్ ద్వారా లక్ష క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని వాటిని ఒడిసి పట్టి  కన్నెపల్లి ద్వారా బస్వాపూర్, గంధ మల్ల రిజర్వాయర్లను నింపాలని దీంతో వ్యవసాయదారులకు, పాడి రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్ , బిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు , బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి , చింతల వెంకటేశ్వర్ రెడ్డి ,పార్టీ నాయకులు,కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.