24 August, 2026 | 1:50 PM

ధర్నా కేసులో కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ నాయకులు

24-08-2026 12:42 PM

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 24 ( విజయక్రాంతి ): బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వెళ్తున్న సమయంలో ఉప్పల్ రైల్వే గేటు వద్ద చేసిన ధర్నాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కేసులో భాగముగా జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ 12వ వార్డు అధ్యక్షులు మేనం రాజేందర్, యూత్ నాయకులు సింగనవేణి చిరంజీవి, సోషల్ మీడియా జిల్లా ఇంచార్జి పూసల యుగేంద్రచారి సోమవారం కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు