ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు
నాగల్‌గిద్ద, ఆగస్టు 24 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ నాగల్‌గిద్ద మండలం ఎనకపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు నర్సారెడ్డి ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, వికలాంగుడిగా జీవనం సాగించడంతో పాటు సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.నర్సారెడ్డి సమర్పించిన ఫిర్యాదును ఎంపీడీవో మహేశ్వరరావు స్వీకరించి, తదుపరి పరిశీలన కోసం హౌసింగ్ ఏఈ శ్రీనివాస్‌కు అందించారు. నర్సారెడ్డి పరిస్థితిని, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆయనకున్న అర్హతను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం ఇల్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వికలాంగుడైన నర్సారెడ్డికి ప్రభుత్వం నుంచి గృహ సదుపాయం కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.






