25లోపే దరఖాస్తు చేసుకోవాలి
24-08-2026 12:39 PM
నాగల్‌గిద్ద, ఆగస్టు 24 (విజయ క్రాంతి): చేయూత పింఛన్లకు అర్హులైన వారు ఈ నెల 25వ తేదీలోపే దరఖాస్తు చేసుకోవాలని నాగల్‌గిద్ద మండల ఎంపీడీవో మహేశ్వరరావు సూచించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేతి కార్మికులు, తలసేమియా, సికిల్‌సెల్ డిసీజ్, హెమోఫీలియా తదితర కేటగిరీల అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 31 వరకు గడువు ఉన్నప్పటికీ చివరి వరకు వేచి ఉండకుండా 25లోపే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మహేశ్వరరావు కోరారు.






