మాచాపూర్‌లో దేవలక్ష్మి మృతదేహానికి రవీందర్‌రెడ్డి నివాళి
సిద్దిపేట రూరల్,ఆగస్టు 24: మాచాపూర్ గ్రామానికి చెందిన పిట్ల ఎల్లం భార్య పిట్ల దేవలక్ష్మి కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి సోమవారం మాచాపూర్ గ్రామానికి చేరుకుని దేవలక్ష్మి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి భర్త ఎల్లంను పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.
కార్యక్రమంలో మాచాపూర్ సర్పంచ్ బాలరాజు, మాజీ సర్పంచులు వెంకటరెడ్డి, బాలయ్య, రూరల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బట్టు భాస్కర్‌రెడ్డి, తోర్నాల సర్పంచ్ గోపీనాథ్‌రెడ్డి, సీతారాంపల్లి సర్పంచ్ రత్నాకర్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు, టీఆర్‌ఎస్‌వీ నాయకులు సతీష్‌రెడ్డి, భూర్గుపల్లి రామరాజు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.






