22 April, 2026 | 4:30 PM

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీఆర్ఎస్ నేతల మద్దతు

22-04-2026 03:09 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవ్వడంతో కార్మిక జేఏసీ సమ్మెకు పిలునిచ్చిన నేపథ్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్, పీర్జాదిగూడ పరిధిలోని ఉప్పల్ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి పలు కీలక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.

సంస్థ బలోపేతానికి ఆర్థిక సహాయం అందించడం, ఉద్యోగుల జీతాల పెంపు, పెండింగ్ సమస్యల పరిష్కారం, కొత్త బస్సుల కొనుగోలు, డిపోల అభివృద్ధి వంటి చర్యలతో ఆర్టీసీని కాపాడాలని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని  విమర్శించారు.

వెంటనే ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కౌడే పోచయ్య, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిర్మల, ఆకుల మధుకర్, కందుకూరి ఆంజనేయులు, బుల్లెట్ శంకర్, అశోక్ రెడ్డి, సతీష్, శ్రీ రాములు గౌడ్, అశోక్, కిరణ్ నాయక్, పగిడిపల్లి శ్రీధర్ గౌడ్, పాశం నరేందర్ గౌడ్, శ్రీకాంత్, అమర్ పటేల్, జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.