16 August, 2026 | 4:33 AM

ఆదిలాబాద్‌లో చెన్ను షాపింగ్ మాల్

16-08-2026 12:06 AM
  1. ప్రారంభించిన తారలు ఐశ్వర్య రాజేష్, హెబ్బా పటేల్
  2. సరికొత్త డిజైన్లు, ప్రత్యేకమైన ఆఫర్లు
  3. వినియోగదారులతో కిక్కిరిసిన మాల్

ఆదిలాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ చౌక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్ను షాపింగ్ మాల్‌ను శనివారం ప్రముఖ సినీ తారలు ఐశ్వర్య రాజేష్, హెబ్బా పటేల్‌లతో కలిసి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారం భించారు. వ్యాపార రంగంలో భారీ ఆఫర్లతో షాపింగ్ మాల్ ప్రారంభం కావడంతో వినియోగదారులతో కిటకిటలాడింది.

30వ షాపింగ్ మాల్ ఆదిబాబాద్ జిల్లా కేం ద్రం లో సరికొత్త డిజైన్‌లు, ఆఫర్‌లతో పెద్ద మొ త్తంలో వస్త్రధార ణ షాపింగ్ మాల్ అందుబాటులోకి తీసుకురావడం, మరో వైపు పట్టణానికి సినీ గ్లామర్ రావడంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో రోడ్లన్ని కిక్కిరిశాయి.

సినీ తారలు ఐశ్వర్య రా జేష్, హెబ్బా పటేల్ అభిమానుల కోసం షాపింగ్ హాల్ ముం దు ఏర్పాటు చేసిన వేదిక మీద కు వచ్చి షాపింగ్ మాల్‌లోని ఆఫర్లను ప్రకటించడమే కాకుం డా సినీ డైలాగ్‌లు చెప్పడ ంతో ప్రజలు కేరింతలు కొట్టారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్ర మంలో మాజీ మంత్రి జో గు రామన్న, ము న్సిపల్ చైర్ పర్సన్ బండా రి అనూష, చెన్న య్ షాపింగ్ మాల్ ఎండీ ఎం వెంకట్ రెడ్డి, డైరెక్టర్ క్రిష్ణారావు, నాయకులు కంది శ్రీనివా స్‌రెడ్డి, ఆకుల రేణుక ప్రవీణ్ హాజరయ్యారు.