16 August, 2026 | 2:29 AM

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

16-08-2026 12:00 AM
  1. ఘనంగా పంద్రాగస్టు వేడుకలు 
  2. చంచల్‌గూడ జైలులో జెండాను ఆవిష్కరించిన  డీజీ సౌమ్య మిశ్రా 
  3. పలు చోట్ల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, నవీన్ యాదవ్

మలక్పేట్, ఆగస్టు 13  (విజయ్ క్రాంతి): 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వాడవాడలో జాతీయ పతాకా న్ని ఆవిష్కరించారు. చంచల్గూడా జైలులోని పరేడ్ గ్రౌండ్లో జైల్లో శాఖ డీజీ సౌమ్య మిశ్రా జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జైలు శాఖ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆజంపుర లోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆజం అలీ, లాయక్ అలీ, మారుతి, సాయా భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా  మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల డివిజన్లో విస్తృతం గా తిరిగి 42  ప్రాంతాలలో జాతీయ జెండా ను ఎగరవేశారు. ముసలాంబాగ్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి జాతీయ జెండా ఎగురవేసి పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

చాణిక్యపురి కాలనీలో..

ఉప్పల్ ఆగస్టు 15 విజయక్రాంతి : శక్తి సాయి నగర్ డివిజన్ పరిధిలోని చాణిక్యపురి కాలనీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు దశరథ్, జనరల్ సెక్రటరీ కిషోర్ గౌడ్, దుర్గామాత టెంపుల్ అధ్యక్షుడు గంధ మల్ల రాములు గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

నాచారం పోలీస్ స్టేషన్లో సీఐ ధనుంజయ్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు సిబ్బందికి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని దేశభక్తి నినాదాలతో వేడుకలను నిర్వహించారు.

కేర్ అండ్ క్యూర్ ఆసుపత్రిలో.. 

కూకట్‌పల్లి, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఆల్విన్ కాలనీ లోని కేర్ అండ్ క్యూర్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో స్వాతంత్య్ర దినో త్స వ వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్ట ర్ జాహెద్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో ఆల్విన్ కాలనీ  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాహెద్  మాట్లాడుతూ భావితరాల్లో దేశభక్తిని, జా తీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దో హదపడతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్థో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. జి.ఎన్.సురేష్ బాబు,డాక్టర్ సాయి భరద్వాజ్, బాబాజాన్, సైదా, అనిల్, తరుణ్, ఆస్పత్రి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

నిమ్స్‌లో.. 

పంజాగుట్ట,ఆగస్టు15(విజయక్రాంతి): నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొ.రాహుల్ దేవరాజ్ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ పతాకానికి వందనం చేశారు.

ఈ సందర్భంగా ప్రొ. రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ.. నిమ్స్ ఒక ప్రము ఖ వైద్య సంస్థగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు,వైద్య విద్య, పరిశోధన రంగాల్లోనూ మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వైద్యు లు, నర్సింగ్ సిబ్బంది, అధికారులు, ఉద్యోగు లు మరియు ఇతర సిబ్బందిని గుర్తించి, ని మ్స్ డైరెక్టర్ ప్రొ. రాహుల్ దేవరాజ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులను అందజేసి అభినందించారు.

ఆరవ వార్డులో.. 

సికింద్రాబాద్, ఆగస్టు15 (విజయక్రాంతి) : జాతీయ సమైక్యతను కాపాడుతూ,దేశ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పాండు యాదవ్ అన్నారు.  80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆరోవ వార్డ్ పరిధిలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలలో కంటోన్మెంట్ బోర్డ్ ఆరోవ వార్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆ లపించి,స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు బిస్కెట్లు,పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ అధ్యక్షులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

నామినేటెడ్ సభ్యురాలు నర్మద ఆధ్వర్యంలో.. 

సికింద్రాబాద్, ఆగస్టు15 (విజయక్రాంతి): దేశం కోసం ఎందరో దేశభక్తుల బలిదానాల త్యాగ ఫలం చేసిన మహనీయుల ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు.కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పలు ప్రాంతాలలో కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్, బిజెపి నాయకులతో కలిసి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయగీతం ఆలపించి స్వతంత్ర సమరయోధులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు మహిళలు తదిముషీరాబాద్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 

పంద్రాగస్టు వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ 

ముషీరాబాద్,ఆగస్టు15(విజయక్రాంతి): నియోజకవర్గంలో 80 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం వైభవంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని కవాడిగూడ, భోలక్ పూర్, ముషీరాబాద్, గాంధీనగర్ రాంనగర్ అడిక్మెట్ డివిజన్లోని పలు బస్తీలు కాలనీలలో ఆయా పార్టీల నేతలు మువ్వన్నెల జెండాను  ఎగరవేశారు. ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు పోలీస్ స్టేషన్లు యువజన సంఘాలు ఆయా పార్టీల కార్యాలయాల ఎదుట త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ నాయకులు జయసింహ, నగేష్ ముదిరాజ్, ఆయా డివిజన్ల పార్టీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.తరులు పాల్గొన్నారు.

నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి

ఖైరతాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): జాతీయ నేతల స్ఫూర్తిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్ల బ్ ఇండియా ఆధ్వర్యంలో తొలిసారిగా మీడి యా స్వేచ్ఛ జర్నలిస్టుల రక్షణపై భారీ కాంక్లే వ్ నిర్వహించనున్నారని వెల్లడించారు.

ఆగస్టు 22, 23 తేదీల్లో కాంక్లేవ్ జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ రెండు రోజుల జాతీయ సదస్సును విజయవంతం చేయడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు వివరించారు. దేశమంటే మట్టికాదోయ్,దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ అప్పారావు స్ఫూర్తిని ఆకళింపు చేసుకొని ప్ర తిఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఇతర స భ్యులు అభిప్రాయపడ్డారు.

ఈ వేడుకల్లో ప్రె స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్ప ల,ఉపాధ్యక్షుడు ఏ.రాజేశ్, జాయింట్ సెక్రెటరీలు చిలుకూరి  హరిప్రసాద్, వర్ధిల్లి బాబురావు, సీనియర్ జర్నలిస్టులు, చిన్నపత్రికల సంఘం నేతలు యూసుఫ్ బాబు, అగస్టీన్, గొల్ల రమేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

టీజీఐసీసీసీలో..

బంజారాహిల్స్, ఆగస్టు 15 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) భారత 80వ స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం జరిగిన ఈ వేడుకలకు టీజీఐసీసీసీ డైరెక్టర్ వి.బి.కమలాసన్ రెడ్డి తరపున సెంటర్ ఎస్పీ మనోహర్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనంలో పాల్గొన్నా రు. అనంతరం సిబ్బందిని ఉద్దేశిస్తూ ప్రసంగించారు.వారందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.ఈ వేడుకల్లో అడిషనల్ డీసీపీలు వెంకటరామిరెడ్డి, వెంక ట్ రెడ్డి, ఏసీపీలు, ఇతర ఉన్నతాధికారులు, సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్వతంత్ర వీరుల స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను సాధించాలి

జూబ్లీహిల్స్, ఆగస్టు 15 (విజయక్రాంతి): భారత స్వతంత్ర పోరాట వీరుల స్ఫూర్తితో విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పిలుపునిచ్చారు.యూసుఫ్ గూడ ప్రభుత్వ పాఠశాలలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు.జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు తమ జీవితాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేశారని గుర్తు చేశారు.వారి స్ఫూర్తితో చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, దేశభక్తితో పాటు మంచి నడవడికను అలవరచుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.

అనంతరం పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేసి అభినందించారు. విద్యార్థుల్లో చదువుతోపాటు క్రీడా స్ఫూర్తి కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఓల్ బోయిన్‌పల్లిలో.. 

సికింద్రాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి స్ఫూర్తితో ముందుకు సాగాలని  మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. దేశ 80 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఓల్ బోయిన్ పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు..

అనంతరం ఓల్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో హస్మత్పేట్, గ్రీన్వుడ్ స్కూల్,మాస్టర్మైండ్, మేస్త్రి యూనియన్ ఆఫీస్, ఆర్ ఆర్ నగర్,ఓల్ ఏజ్ హోమ్స్, ప్రియదర్శిని హోటల్ ఆటో స్టాండ్, శ్రీ సాయి ఎంక్లేవ్, హెచ్‌ఏఎల్ పార్క్,ఆటో స్టాండ్, శంకర్ ఎంక్లేవ్, మైత్రివనం కాలనీ, గౌరీ నగర్ కమ్యూనిటీ హాల్, పివి  ఎంక్లేవ్ కమ్యూనిటీ హాల్, సమతా నగర్ కమ్యూనిటీ హాల్, వెస్లీ టీచర్స్ కాలనీ, ఎల్ బి నగర్, హనుమాన్ టెంపుల్, ఫ్రెండ్స్ కాలనీ, మల్లికార్జున్ కాలనీ సీనియర్ సిటిజన్ కమిటీ హాల్, భగత్ సింగ్ ఆటో స్టాండ్, బృందావన్ కాలనీ,శాంతి నికేతన్ కాలనీ, కార్ యూనియన్ డ్రైవర్స్ అసోసియేషన్, సెంట్రింగ్ ఆఫీస్,ఆనంద్ కాలనీ,హస్మత్పేట్‌ఎస్సీ బస్తీ, మాల బస్తీ, కేజిఎన్ మోటార్స్,గంగపుత్ర సంఘం, చెవిటి,మూగ పాఠశాల, లైన్స్ స్టోన్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఓల్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ నాయకులు కాలనీ వాసులతో కలిసి  జాతీయ  జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ అధ్యక్షులు సయ్యద్‌ఇజాజ్,డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్,సెక్రటరీ హరినాథ్,గడ్డం నర్సింగ్ రావు,ఖదీర్,లలిత గౌడ్, దేవి, ఖాటూన్,పద్మ,ఉమ,సీనియర్ మహిళా నాయకురాలు,పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకల్లో కోట నీలిమ..

సికింద్రాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్ని డాక్టర్ కోట నీలిమ తెలియజేశారు.80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేఎమ్ జే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో సెయింట్ థెరిసా హాస్పిటల్లో, సనత్నగర్ డివిజన్లోని నెహ్రూ పార్క్ వద్ద, బేగంపేట్ డివిజన్లోని రసూల్పుర చౌరస్తా వద్ద, బన్సీలాల్పేట్ డివిజన్లోని బైబిల్ హౌస్ వద్ద స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొని జాతీయ జెండా ను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించి, ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మహిళా సాధికారతలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని కోట నీలిమ తెలిపారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ప్రజా స్వామ్య విలువలను కాపాడుతూ ప్రతి ఒక్క రూ దేశ అభివృద్ధికి తమ వంతు పాత్ర పో షించాలని డాక్టర్ కోట నీలిమ పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమాల్లోఆయా డివిజన్ల కాంగ్రె స్ పార్టీ అధ్యక్షులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు,మహిళలు, యువతతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.