తండాలకు పంచాయతీ హోదా..గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగు

17-09-2026 | 11:48am

* మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషికి కృతజ్ఞతగా రాజ్యతండాలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల పాలాభిషేకం

* గిరిజనులకు ప్రత్యేక గ్రామ పంచాయతీలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పనపై హర్షం

పాపన్నపేట,సెప్టెంబర్17: తండాలకు ప్రత్యేక గ్రామ పంచాయతీల హోదా కల్పించి గిరిజనుల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌(KCR)కు కృతజ్ఞతగా గురువారం రాజ్య తండాలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌(BRS) నాయకులు మాట్లాడుతూ.. తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన గ్రామాలకు స్వయం పాలనకు మార్గం సుగమమైందన్నారు. గిరిజనులకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలు వారి అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతి, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం కేసీఆర్‌ చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తండా ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు