బీఆర్ఎస్ నేతలు పిక్నిక్ వెళ్లారు: మంత్రి శ్రీధర్ బాబు
25-07-2024 05:01 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు పిక్నిక్ వెళ్లారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు కూలిన మేడిగడ్డను చూసి వస్తారా? అని మంత్రి ప్రశ్నించారు. మంథినిలో ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని శ్రీధర్ బాబు ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు ఎన్నిసార్లు వెళ్తే తమకు అంత మేలు అని మంత్రి తెలిపారు. భారత రాష్ట్ర సమితి నాయకుల బృందం భారత రాష్ట్ర సమితి నాయకుల బృందం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం గురువారం పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ లోని లోయరు మానేరు డ్యామ్‌ను సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.






