calender_icon.png 21 November, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కింగ్ సిబ్బంది మధ్య గొడవ.. ఒకరు మృతి

25-07-2024 07:07:32 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ లో పార్కింగ్ సిబ్బంది మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవలో ముత్తుస్వామి అనే సిబ్బందిపై తోటి ఉద్యోగులు రాళ్లు, రాడ్ తో దాడి చేశారు. ఈ దాడిలో ముత్తుస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా.. ముత్తుస్వామి చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాంధీ దవాఖానకు చేరుకొని ముత్తుస్వామి మృతికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.