25-07-2024 04:43:18 PM
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి నాయకుల బృందం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం పర్యటనకు బయలుదేరింది. గురువారం సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ లోని లోయరు మానేరు డ్యామ్‌ను సందర్శించనున్నారు. అనంతరం కేటీఆర్, ఇతర నాయకులు అక్కడ మీడియాతో మాట్లాడనున్నారు. జూలై 25వ తేదీ గురువారం సాయంత్రం నాటికి వారు లోయర్ మానేర్ డ్యామ్ రిజర్వాయర్‌కు చేరుకుంటారని, ఆ తర్వాత రామగుండం వెళతారని, అక్కడ రాత్రి బస చేస్తారని బీఆర్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్, మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి తిరిగి హైదరాబాద్‌కు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.