హరీశ్ రావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు
13-12-2024 07:38 PM
పటాన్ చెరు (విజయక్రాంతి): మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఐలాపూర్ లో బీఆర్ఎస్ యువనేత మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమీన్ పూర్ లెవల్ కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ ఆదివారంతో ముగుస్తుందని, అదే రోజు సాయంత్రం నిర్వహించే బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమానికి రావాలని హరీశ్ రావును బీఆర్ఎస్ నాయకులు ఆహ్వానించారు. హరీశ్ రావు ను కలిసిన వారిలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, నాయకులు ఆదర్శ్ రెడ్డి, అంజయ్య యాదవ్, శ్రీధర్ చారి తదితరులు ఉన్నారు.






