కేరళ గ్లోబల్ హై స్కూల్లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) రుద్రంగి మండల కేంద్రంలోని కేరళ గ్లోబల్ హైస్కూల్లో(Kerala Global High School) శుక్రవారం రోజున కృష్ణాష్టమి వేడుకలను విద్యార్థిని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో శ్రీ కృష్ణుడి శోభాయాత్రను నిర్వహించారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చైర్మన్ బాబు నంబియార్ మాట్లాడుతూ... ప్రతి ఏటా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను(Sri Krishnashtami celebr) స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
చదువుతో పాటు మన సాంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు నేర్పాలనే ఉద్దేశంతో ప్రతి పండుగ వేడుకలను జరపడం జరుగుతుందని అన్నారు. మన సాంస్కృతి సంప్రదాయలు మనకు ఎన్నో గొప్ప విషయాలను తెలుపుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లతిక, పాఠశాల ఇంచార్జ్ నరిగే విజయ్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






