4 September, 2026 | 7:54 PM

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఐలాపూర్ మాణిక్

04-09-2026 | 06:49pm

అమీన్ పూర్, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): పటాన్‌చెరు(Patancheru) నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) ఉత్సవాల్లో భారత రాష్ట్ర సమితి (BRS) నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్  పాల్గొని, శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీకృష్ణుడి జీవితం ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప సందేశం, ధర్మం కోసం నిలబడటం, అధర్మాన్ని ఎదిరించడం, సత్యాన్ని కాపాడటం, కష్టాలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం వంటి ఎన్నో విలువలను భగవద్గీత(Bhagavad Gita) ద్వారా శ్రీకృష్ణుడు మానవాళికి అందించారు అన్నారు