4 September, 2026 | 7:53 PM

కాపుగల్లులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

04-09-2026 | 06:43pm

* భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు.. అన్నదానం, స్వామివారి ఊరేగింపు

కోదాడ(విజయక్రాంతి): కోదాడ మండల(Kodad Mandal) పరిధిలోని కాపుగల్లు గ్రామంలో శ్రీకృష్ణ మందిర ఆవరణలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను(Sri Krishna Ashtami celebrations) ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టి, స్వామివారి ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రబోధ సేవాసమితి కోదాడ శాఖ సభ్యులు మాట్లాడుతూ... భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలకు ఇప్పటివరకు 330 మందికిపైగా స్వామీజీలు పలు భాషల్లో వివరణలు రాశారని తెలిపారు. శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.