29 July, 2026 | 6:16 PM

అర్హులైన ప్రతి ఓటరు పేరు... ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడండి

29-07-2026 05:45 PM

ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించండి

డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ లో అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యలా చూడాలని ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ పరిధిలోని చంద్రపురి కాలనీ డివిజన్లో కొనసాగుతున్న స్పెషల్ ఎంటెన్సీ రివిజన్ కార్యక్రమానికి బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ గజ్జల కాంతం తో కలిసి పరిశీలించారు.

అనంతరం కాప్రా తాసిల్దార్ మతిన్ తదితర రెవెన్యూ బృందం తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా చూడాలని ఎవరి ఓటర్ పేరు అన్యాయంగా  తొలగించబడకుండా ఇంటింటికి వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలన చేపట్టాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతంగా తెలంగాణలో నిర్వహిస్తున్నందుకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యంగా జవహర్ నగర్ లో ఎస్ ఐ ఆర్ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్నందుకు పార్టీ శ్రేణులను అభినందించారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా పారదర్శకంగా నిర్వహించి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షురాలు శాంతి కోటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బిఎల్వోలు, బిఎల్ఎలు తదితరులు పాల్గొన్నారు.