11 June, 2026 | 3:49 PM

కవితకు బిగ్ షాక్.. TRS టైటిల్ పై BRS ఫిర్యాదు

11-06-2026 02:47 PM

హైదరాబాద్: కల్వకుంట్ల కవితకు(Kalvakuntla Kavitha) షాక్ తగిలింది. కవిత రాజకీయ పార్టీ టీఆర్ఎస్(Telangana Rakshana Sena) పై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పేరుపై దాదాపు 700 అభ్యంతరాలు ఈసీఐకి అందాయి. టీఆర్ఎస్ పేరు తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడి ఉందని బీఆర్ఎస్ పేర్కొంది. ఇప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గానే గుర్తిస్తారని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది.

టీఆర్ఎస్ పేరును ఎవరికీ కేటాయించవద్దని బీఆర్ఎస్ ఈసీఐకి(Election Commission of India) విజ్ఞప్తి చేసింది. కవిత పార్టీ ప్రకటనకు ముందే షోలాపూర్ నేతలు టీఆర్ఎస్ పేరు కోసం ఈసీని ఆశ్రయించారు. 'తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన' మహారాష్ట్ర షోలాపూర్ కేంద్రంగా పని చేస్తోంది. టీఆర్ఎస్ పేరు కోసం తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన దరఖాస్తు చేసుకుంది. కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే షోలాపూర్ నేత దయానంద్ మహాదేవ్(Solapur leader Dayanand Mahadev) ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈసీ నిబంధనల ప్రకారం పార్టీ పేరుపై అభ్యంతరాల స్వీకరణకు పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణ రాజ్య సమితి పార్టీ కవిత టీఆర్ఎస్ పార్టీ పేరు వాడడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.