11 June, 2026 | 3:49 PM

దేశంలో మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి

11-06-2026 03:18 PM

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కోటీశ్వరులవుతారు: బండి సంజయ్

కరీంనగర్ : దేశంలో మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రకృతి వ్యవసాయంపై(Natural Farming) రైతు సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కోటీశ్వరులవుతారని బండి సంజయ్ పేర్కొన్నారు.  రైతులు కోటీశ్వరులవడమేమో కానీ.. ధాన్యమే కొనే పరిస్థితి లేదని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం రూ. 4 వేల ప్రోత్సాహకం ఇస్తోందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసి సెల్ఫీ పంపిన రైతులను సన్మానిస్తామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తనకు స్ఫూర్తి అన్న బండి సంజయ్ 20 ఏళ్ల నుండి ఎప్పుడూ జ్వరం రాలేదన్నారు. మొన్న హైదరాబాద్‌లో పాలు తాగడంతో జ్వరం వచ్చి మూడు రోజులు బెడ్ మీద పడ్డానని కేంద్ర సహాయ మంత్రి సూచించారు. తనకు ఎలాంటి వ్యాధులు లేవు.. తప్పెవరిదంటే.. తనదే అన్నారు. రోగానికి కారకులం మనమే.. నివారణ చేసేది కూడా మనమేనని బండి సంజయ్ వివరించారు.