Breaking News

కరెంట్ కోతలపై బీఆర్‌ఎస్ ఆందోళన

03-09-2026 | 01:45pm

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కరెంట్ కోతలకు నిరసనగా బీఆర్‌ఎస్(Bharat Rashtra Samithi) ఆధ్వర్యంలో గురువారం తిమ్మాజిపేట, బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తాడూరు సబ్‌స్టేషన్ల(Tadoor substations) ఎదుట ఆందోళనలు చేపట్టారు. సబ్‌స్టేషన్‌ల లాగ్‌ బుక్‌లను పరిశీలించారు. వ్యవసాయానికి 13 గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress government) ప్రశ్నించారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. బిజినేపల్లిలో ఏఈ శ్రీనివాసాచారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు  పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు