3 September, 2026 | 1:42 PM

1000 రోజుల ప్రజా పాలన.. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

03-09-2026 | 12:57pm

3.50 కోట్లతో పేరుపల్లి బుగ్గ వాగు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు

కారేపల్లి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలనలో ప్రజలకు చేరువగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తోందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూరి రాంబాబుఅన్నారు. కారేపల్లిలోని వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్‌ నందు మండలాధ్యక్షుడు తోటకూరీ రాంబాబు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో 1000 రోజుల ప్రజా ప్రభుత్వ పాలనపై  సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ... పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ వైరా నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారన్నారు. కారేపల్లి మండలంలో రూ.3.50 కోట్ల రూపాయలతో పేరుపల్లి బ్రిడ్జి నిర్మాణానికి నిధులను మంజూరు చేయడం హర్షనీయమని, అలాగే కోట్ల రూపాయలతో మండలంలో సిసి రోడ్ల  నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు గుడిసె లేని గ్రామాన్ని చూడాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు.రైతుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాంబాబు తెలిపారు. మండలంలో 50 వేల క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేసి, రైతులకు సుమారు రూ.2 కోట్ల మేర బోనస్ అందజేసినట్లు వివరించారు. పేదలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భానోత్ రామ్మూర్తి, సర్పంచ్ మతృ నాయక్ ,సొసైటీ మాజీ డైరెక్టర్ అడ్డగోడ ఐలయ్య ,సురేందర్ మనియార్, షాదీఖాన్ చైర్మన్ యాకుబ్ అలీ, జిల్లా మైనారిటీ జనరల్ సెక్రెటరీ మజీద్ పాషా షేరు, పొలగాని శ్రీను, తాజుద్దీన్, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.