15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ పాట ఆవిష్కరణ

25-04-2025 02:07 AM

బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి

హనుమకొండ, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): ఏనుగుల రాకేష్ రెడ్డి రూపొంచించిన ‘ఎగిసెర బలే ఎగిసెర సారే రావాలంటూ ఓరుగల్లు పిలిచెర‘  అనే పాటను, రిటైర్డ్ ఎమ్మార్వో మహమ్మద్ సిరాజుద్దీన్ రచించిన పాటను, జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పద్మ శ్రీ గడ్డం సమ్మయ్య లు పాల్గొని పాటను ఆవిష్కరించడం జరిగింది. ప్రముఖ రచయిత, గాయకులు మానుకోట ప్రసాద్, జాగృతి రాష్ట్ర నాయకులు దాస్యం విజయ్ భాస్కర్, రజినీసాయిచంద్ లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడు  ప్రొఫెసర్ జయశంకర్ ప్రస్తావన లేకుండా తెలంగాణ ఉండదు. ఓరుగల్లు గడ్డ మీద నుండి ఆ మహనీయుడిని తలుచుకోవడం మన అందరి బాధ్యత.

వారు తెలంగాణ భావజాలాన్ని బతికించి అందిస్తే ఆయన ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ కొనసాగించి రాష్ట్రాన్ని తెచ్చారు.14 ఏళ్ల పోరాటంలో, 10 ఏళ్ల పాలనలో మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని విలసిల్లచేసి, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా నిలబెట్టారన్నారు. ఉద్యమ పార్టీ రజతోత్సవ సభ ఘనంగా నిర్వహించబోతున్నామని, ఈ సభ బీఆర్‌ఎస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది మహా సభను విజయవంతం చేయాలీ.సభను విజయవంతం చేయడంకోసం సోదరుడు రాకేష్ రెడ్డి ముందుపడి ఇంతటి మంచి పాటను గొప్పగా పాటను రూపొందించడం చాలా సంతోషం అన్నారు.

ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పాట తెలంగాణ ప్రజల ప్రాణం పేద ప్రజల పేగు బంధం పాట వందల ప్రసంగాల సారాన్ని ఒక్క పాట చెప్తుందనారు.  పద్మ శ్రీ గడ్డం సమ్మయ్య మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన కళలకు, కళా రూపాలను పూర్వ రవైభవం వచ్చిందని,  కేసీఆర్ గారు చేసిన 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలనలో వృథా కాలేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులకు, కళాభిమానులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.