calender_icon.png 28 May, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

25-04-2025 02:07:14 AM

బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఏప్రిల్ 24:  ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దామని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్ పిలుపునిచ్చారు.తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం గురువారం మండలంలోని కోమటిపల్లి, కొమ్మాల, నాణ్యతండా, అడివెంల గ్రామాలలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన పార్టీ బీఆర్‌ఎస్ అని,స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపి దేశాన్ని రోల్ మోడల్ గా నిలపారని గుర్తు చేశారు.

ఈనెల 27న జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దిశా నిర్దేశం చేయనున్నారని అందుకు ప్రతి గ్రామం నుండి బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

ఆయా కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ నాయకులు చిర్రబోయిన వెంకన్న,తాడూరి రామకోటి, నున్న యాదగిరి, గడ్డం వెంకన్న,నాగు నాయక్,తిరుమలేష్,శిగ వెంకన్న, లింగస్వామి, తొడుసు మల్లేష్,నున్న సురేష్,నున్న మహేష్,షేక్ జానీమియా, సాలయ్య, ఆంజనేయులు,సతీష్ పాల్గొన్నారు.