calender_icon.png 13 February, 2026 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నం "మున్సిపాలిటీ" బీఆర్ఎస్ కైవసం

13-02-2026 02:38:27 PM

గులాబీ పార్టీ 13 స్థానాల విజయం 

కాంగ్రెస్ కు 08, బీజేపీకి 02, ఇతరులు 01 స్థానం గెలుపు 

అబ్దుల్లాపూర్ మెట్: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.  మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ,  శేరిగూడలోని శ్రీ ఇందు కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాగా, ఎన్నికల లెక్కింపును రెండు రౌండ్స్ గా విభజించి లెక్కించారు. మొదటి రౌండ్ లో 1వ వార్డు నుంచి 12 వరకు, రెండవ రౌండ్ లో 13 వార్డు నుంచి 24 వార్డు గా ఫలితాలు లెక్కించారు. అధికార కాంగ్రెస్ (8), బీఆర్ఎస్(13) మధ్య నువ్వా నేనా అంటూ హోరాహోరి పోరు కొనసాగింది. బీజేపీ (2), కాంగ్రెస్ రెబల్ (1) సాధించాయి.

కాగా వార్డుల వారీగా మొదటి రౌండ్ ఫలితాలు ఇలా ఉన్నాయి.. 1వ వార్డు (బీజేపీ) ముత్యాల శ్యామల భాస్కర్, 2వ వార్డు (కాంగ్రెస్) నీళ్ల భాను బాబు, 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థి (కాంగ్రెస్ రెబల్ ) దాసరి మురళి, 4వ వార్డు (బీఆర్ఎస్) కొండ్రు ప్రవీణ్ కుమార్, 5వ వార్డు (బీఆర్ఎస్) జెర్కొని మమత రాజు, 6వ వార్డు (కాంగ్రెస్) మహమ్మద్ అమినా బేగం గౌస్, 7వ వార్డు (బీఆర్ఎస్) టేకుల సుదర్శన్ రెడ్డి 8వ వార్డు (కాంగ్రెస్) వర్త్య రాందాస్ నాయక్, 9వ వార్డు (కాంగ్రెస్) దారు రాఘవేందర్ రావు, 10వ వార్డు (కాంగ్రెస్) దొంతారామని భార్గవి రాజు ముదిరాజ్, 11వ వార్డు (బీఆర్ఎస్) కొండ్రు శ్రీలత రాంబాబు, 12వ వార్డు (బీఆర్ఎస్) కొండిగారి త్రిలోక్, 13వ వార్డు (కాంగ్రెస్) ఇందూరి శ్రీనివాస్, 14వ వార్డు (కాంగ్రెస్) ఎదుల విజయలక్ష్మి, 15వ వార్డు (బీఆర్ఎస్) క్యామ శంకర్, 16వ వార్డు అల్వాల జ్యోతి వెంకట్ రెడ్డి 17వ వార్డు (బీఆర్ఎస్) మడుపు లక్ష్మమ్మ, 18వ వార్డు (బీజేపీ) సిద్ధం భానుప్రియ, 19వ వార్డు (బీఆర్ఎస్) ఆకుల యాదగిరి, 20వ వార్డు (బీఆర్ఎస్ ) మంద జయమ్మ మహేష్, 21వ వార్డు 21వ వార్డు (బీఆర్ఎస్) చిలుకల బుగ్గరాములు 22వ వార్డు (కాంగ్రెస్) కప్పరి స్రవంతి చందు, 23వ వార్డు నీలం శ్వేతా భాను, 24వ వార్డు (బీఆర్ఎస్) గూడూరి గిరి విజయాలు సాధించారు. ఈ ఫలితాలతో చైర్మన్, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ సొంతం చేసుకోనున్నాయి.