calender_icon.png 5 November, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ దే గెలుపు

04-11-2025 10:31:09 PM

మాదారం మాజీ సరిత సురేందర్ గౌడ్..

అమీన్ పూర్/జిన్నారం: జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెస్తుందని, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మాదారం మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ తెలిపారు. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలంతా మళ్లీ కేసీఆర్ రావాలి, సునీతమ్మ గెలవాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని బెదిరిస్తున్నారని, ఇలాంటి బ్లాక్మెయిల్ కు ప్రజలు భయపడరని సురేందర్ గౌడ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మహిళలంతా ఏకమై ఓటుతో కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశం గౌడ్, రాజేష్, కొడకంచి మాజీ సర్పంచ్ శివరాజ్, నల్తూరు మాజీ సర్పంచ్ జనార్ధన్, అశోక్, శీను, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.