calender_icon.png 5 November, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కృషి

04-11-2025 10:47:39 PM

మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని, నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం తగిన స్థలాన్ని గుర్తించే దిశగా, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పలు ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని రవి సూచించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఇంటికీ విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ప్రతిపాదనను తెచ్చామని, అలాగే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న విద్యుత్ అధికారులకు ఏఈ సత్యనారాయణ రెడ్డికి వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్‌మెన్ భాస్కర్, కాంట్రాక్టర్లు, రాంగోపాల్ రావ్, శ్రీనివాస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.