04-11-2025 10:24:28 PM
భీమిని (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమినీ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో వైకుంఠ చతుర్దశి పురస్కరించుకొని మహిళలు దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహస్రదీపాలంకరణలో భాగంగా ఆలయంలో దీపాలను వెలిగించి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆలయ పూజారి సంఘర్ష రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గణపతి పూజ అభిషేకం బిల్వ దళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున భగవాన్ నామస్మరణలు పాల్గొన్నారు. ఆశ్విజ శుద్ధ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు గ్రామంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని గత 40 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వైకుంఠ చతుర్దశి పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంఘర్స్ రవీందర్రావు సంఘర్ సుదర్శన్ రావు, సంతోష్ కుమార్ బండి ప్రభాకర్ గౌడ్, రాజ్ కుమార్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.