8 April, 2026 | 12:46 AM

సుష్మా థియేటర్‌ దగ్గర బీటెక్‌ విద్యార్థి అరెస్ట్

29-10-2024 11:28 AM

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో డ్రగ్స్ విక్రయిస్తున్న బీటెక్ విద్యార్థిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇటీవలే నెల్లూరులో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ కోచింగ్ కోసం నగరానికి వచ్చిన జాన్ అనే యువకుడు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. వనస్థలిపురం సుష్మా థియేటర్‌ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న జాన్ ను పోలీసులు గమనించారు. అతని దగ్గరి నుంచి 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గ్రాము రూ. 2500కు తెచ్చి.. రూ. 5000 చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, తనతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు.