ఎన్నికల వరకే రాజకీయాలు
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల అభివృద్దికి ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. వీఎంఆర్డీఏలోని రోజ్ గార్ మేళాలో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రధాని మోడీ రెండేళ్ల క్రితం రోజ్ గార్ మేళా ప్రారంభించారని చెప్పారు. పది లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మోడీ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్లలో 8 లక్షల మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చారని వెల్లడించారు. విశాఖ ఇంకా ఎంతో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం జాతీయ హోదా కల్పించింది నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు పగలు, పట్టింపులు శత్రుత్వాలు పక్కనబెట్టాలని కోరారు. ఎన్నికల వరకే రాజకీయాలన్న కేంద్రమంది బండి సంజయ్ రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.




