తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా బూడిద గణేష్ ఎన్నిక
పెద్దపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా మంథనికి చెందిన బూడిద గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాలుగవ రాష్ట్ర మహాసభల్లో ఈ నియామకం జరిగింది.
ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో శ్రమజీవులు, కార్మికులు మరియు కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని, తద్వారా జిల్లాలో వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. అణగారిన ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ, పేద ప్రజల గొంతుకగా వ్యవసాయ కార్మిక సంఘం నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
శ్రమ దోపిడీ, బానిసత్వం మరియు కుల వివక్షకు గురవుతున్న వారిని సంఘటితం చేస్తూ, కార్మిక-కర్షక మైత్రి కోసం కృషి చేస్తామని తెలిపారు. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి కష్టం వచ్చినా ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానంలో సహకరిస్తున్న శ్రేయోభిలాషులు, మేధావులు, అభ్యుదయ వాదులు మరియు పాత్రికేయ మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.






