23 June, 2026 | 6:01 PM

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి

23-06-2026 04:54 PM

- చర్ల సీఐ ఏ. రాజువర్మ

చర్ల,(విజయక్రాంతి): మంగళవారం ఈగల్ ఫోర్స్ తెలంగాణ శాఖ పిలుపు మేరకు చర్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో "డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం" అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో చర్ల సిఐ ఏ రాజు వర్మ  మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వ్యసనం వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజం అన్నీ నాశనమవుతాయని హెచ్చరించారు. చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. ఆర్. జాన్  మాట్లాడుతూ, మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక అనారోగ్యాల గురించి వివరించారు. యువత ఆరోగ్యంగా ఉండి దేశ భవిష్యత్తుకు పునాది వేయాలన్నారు.