అంజయ్య నగర్‌లో కుప్పకూలిన భవనం

22-08-2026 | 02:29pm

హైదరాబాద్: గచ్చిబౌలి(Gachibowli) అంజయ్య నగర్‌లో భవనం కూప్పకూలింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి(Building Collapses) శిథిలాలు పక్కనున్న అపార్ట్ మెంట్ పై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. భయంతో పక్కనున్న హాస్టల్ నుంచి వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. నాలాను ఆనుకుని 50 గజాల స్థలంలో ఏడు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. కూలిన భవనంలో ముగ్గురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రక్షణ దళాలు సహాయక చర్యలు చేపట్టారు. యజమాని అత్యాశతో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు