హైదరాబాద్‌లో మళ్లీ అడుగుపెట్టిన 'బర్గర్ సింగ్'
హైదరాబాద్, 17 జూలై 2026:
భారతదేశపు అతిపెద్ద 'మేడ్-ఇన్-ఇండియా' బర్గర్ చైన్ అయిన 'బర్గర్ సింగ్' నగరంలో తమ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. గత రెండేళ్లలో ముంబై, బెంగళూరు మరియు పూణేలలో పలు అవుట్‌లెట్‌లను తెరిచిన ఈ బ్రాండ్.. ఇప్పుడు హైదరాబాద్‌లో 30 అవుట్‌లెట్‌లు, అలాగే తెలంగాణ వ్యాప్తంగా 60 అవుట్‌లెట్‌లకు విస్తరించాలనే ప్రణాళికలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టడం అనేది, దక్షిణ భారతదేశంలో సంస్థ విస్తరణలో ఒక కీలక ముందడుగుగా చెప్పొచ్చు.
ఇటీవల చేపట్టిన సిరీస్ బి నిధుల సమీకరణ తర్వాత, బర్గర్ సింగ్ తన విస్తరణ ప్రణాళికలను మరింత బలోపేతం చేస్తోంది. అలాగే వివిధ మార్కెట్లలో మరింత పటిష్టమైన, విస్తరించదగిన ఫ్రాంచైజీ వ్యవస్థలో పెట్టుబడులు పెడుతోంది. ఈ లాంచ్‌తో బర్గర్ సింగ్ తన జాతీయ స్థాయి ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. ప్రస్తుతం భారతదేశంలోని 100 కి పైగా నగరాల్లో 200 కి పైగా అవుట్‌లెట్‌లతో ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. పాశ్చాత్య ఆకృతిలో అచ్చమైన భారతీయ రుచులను అందించడం ద్వారా బ్రాండ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా భారతీయుల అభిరుచులకు తగినట్లుగా రూపొందించిన ఉత్పత్తులను అందరికీ అందుబాటు ధరల్లో అందిస్తోంది.
హైదరాబాద్‌తో తమకు ఎప్పటినుంచో విడదీయరాని అనుబంధం ఉందనీ, కోవిడ్‌కు ముందు ఇక్కడ రెండు అవుట్‌లెట్‌లను నడిపామనీ బర్గర్ సింగ్ సహ వ్యవస్థాపకుడు నితిన్ రాణా చెప్పారు. ఢిల్లీలో 25 స్టోర్‌లను దాటిన వెంటనే తమ తదుపరి లక్ష్యం ఈ నగరమేననీ, అయితే మహమ్మారి కారణంగా ఆ ప్రణాళికకు తాత్కాలికంగా బ్రేక్ పడిందన్నారు. ఇప్పుడు తమ ప్రణాళికను మళ్లీ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ వ్యాప్తంగా 30, తెలంగాణ వ్యాప్తంగా 60 అవుట్‌లెట్‌లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్వదేశీ క్యూఎస్‌ఆర్ విజయగాథలో భాగమయ్యే అవకాశాన్ని ఇది అందిస్తోంది.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి అవుట్‌లెట్.. వినియోగదారులు ఎంతగానో ఇష్టపడే నిక్కు సింగ్, చుర్ముర్ పాండే, ఉడ్తా పంజాబ్ 2.0, చంకీ పనీర్ పాండే తదితర బర్గర్ సింగ్ ప్రత్యేక మెనూను అందిస్తుంది. బర్గర్ సింగ్ అనేది విదేశీ బర్గర్ చైన్‌లను అనుకరించడానికి సృష్టించినది కాదు. అందుబాటు ధరలో భారతీయుల అభిరుచులకు తగిన బర్గర్‌ను కొత్తగా పరిచయం చేయడానికి సృష్టించబడిన 'మేడ్-ఇన్-ఇండియా' బర్గర్ బ్రాండ్. నేడు, ఇది భారతదేశపు అతిపెద్ద స్వదేశీ బర్గర్ చైన్‌గా నిలుస్తోంది. 2014లో గురుగ్రామ్‌లో స్థాపించబడిన ఈ సంస్థ, ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, పూణే, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, షిల్లాంగ్, జైపూర్, డెహ్రాడూన్, జమ్ము, నాగ్‌పూర్, అహ్మదాబాద్, చండీగఢ్, అమృత్‌సర్ తదితర 100 కి పైగా నగరాల్లో 200 కి పైగా అవుట్‌లెట్‌లకు విస్తరించింది.






