18 July, 2026 | 10:04 PM

మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

18-07-2026 09:25 PM

గద్వాల: గద్వాల పట్టణంలోని బిఎస్ఎన్ఎల్  కార్యాలయంలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ఉచిత స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుక శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని,స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించాలని అన్నారు.

టైలరింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటీ పార్లర్ వంటి రంగాల్లో మరింత నైపుణ్యం సాధించేందుకు శిక్షణ కాలాన్ని పొడిగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే మహిళలకు ఉపాధి అవకాశాలు,రుణాలు,ప్రభుత్వ ప్రోత్సాహం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు మాట్లాడుతూ నెల రోజుల శిక్షణతో పాటు మరికొంత కాలం శిక్షణ అందిస్తే నైపుణ్యం పెరిగి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్, బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.